తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2020, 11:14 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎదురు కాల్పులు-ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు. మృతుడిని హిజ్బుల్ ముజాహిదిన్​కు చెందిన ఆదిల్ గుల్జార్​గా గుర్తించారు అధికారులు.

kashmir
కశ్మీర్​లో ఎదురుకాల్పులు-ఉగ్రవాది హతం

కశ్మీర్​లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చదూర ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హిజ్బుల్ ముజాహిదిన్​కు చెందిన ఆదిల్ గుల్జార్​గా గుర్తించారు పోలీసులు.

ఇదీ చూడండి:'సీఏఏ, ఎన్​పీఆర్​ను తక్షణమే ఉపసంహరించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details