వలస కూలీల ఆగ్రహం రోజురోజుకు కట్టలు తెంచుకుంటోంది. లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు తాము పడిన కష్టాలు కోపం రూపంలో బయటకు చూపిస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్- మధ్యప్రదేశ్లోని ఛక్ఘాట్ వద్ద వందలాది మంది కార్మికులు గుమిగూడారు. పోలీసులు అనుమతినివ్వకపోవడం వల్ల సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి ఉత్తరప్రదేశ్లోకి అడుగుపెట్టారు.
అన్ని ఏర్పాట్లు చేసినా...
ఉత్తరప్రదేశ్లోని సహన్పుర్ జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనేక మంది కూలీలులు వసతి గృహాల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇళ్లకు వెళ్లలేకపోతున్నామనే కారణంతో లాఠీలు, కర్రలు చేతిలో పట్టుకుని అంబాలా రహదారిపై పరుగులు తీశారు. వారిని శాంతిపజేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.