తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలసిపోయిన పాదాలు.. బరువెక్కిన గుండెలు! - india lockdiown

ఓ మహమ్మారి వచ్చి చూపిస్తే కానీ... కళ్లకు కనబడలేదు వలస బతుకుల వెతలు! రూపాయి లేక , అద్దె కట్టలేక, పస్తులుంటూ, దయనీయ స్థితిలో ఊరు బయల్దేరిన దృశ్యాలు సినిమాల్లో చూసి ఉంటాం. కానీ, లాక్​డౌన్​ వేళ హరియాణాలోనూ సొంతగూటికి చేరేందుకు కొన్ని వేలమంది కూలీలు అదే పరిస్థితిని ఎదుర్కొన్న దృశ్యాలు వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Migrant workers are migrating from Haryana
అలసిపోయిన పాదాలు.. బరువెక్కిన గుండెలు!

By

Published : May 22, 2020, 6:36 AM IST

Updated : May 22, 2020, 9:43 AM IST

వలసకూలీల బాధలు

వలస కూలీల కష్టాలు ఎంత అంటే ఏం చెప్పగలం? వారు పడ్డ యాతనను మనం ఎలా వివరించగలం? లాక్​డౌన్​ వేళ హరియాణాలో వ్యయప్రయాసలకోర్చి ఇంటికి చేరుకున్న ఓ వలస కూలీని.. ప్రయాణం ఎలా సాగిందని అడిగితే....

'కూటి కోసం సొంత గూటిని వదిలి.. కూలీ కోసం ఊరు తల్లిని వదిలి.. పట్టణానికి వచ్చా. కరోనా మహమ్మారి వల్ల పుట్టిన లాక్​డౌన్​ వచ్చిన చోటుకే పొమ్మని తరిమింది. ఊరికి తీసుకుపోయే బస్సులు లేక కాలినడక మొదలెట్టా.

చంటి బిడ్డలను కడుపున గట్టుకున్నా. మూటముల్లె నెత్తిన పెట్టుకుని పయనమయ్యా. భగభగమండే సూరీడు నాపై నిప్పులు కురిపిస్తున్నా ఓర్చుకున్నా. నిలువెల్లా చెమటలు చిమ్ముతున్నా సముదాయించుకున్నా. పాదాలకు అగ్గి సెగలు తాకుతున్నా ఆగలేదు. ఆకలి కడుపును పిసికేస్తూంటే.. కన్నీళ్లు పెట్టుకుని మంచినీళ్ల కోసం వెతుక్కున్నా.

రోడ్డు మీద నుంచి వెళ్లొద్దని పోలీసన్నలు లాఠీ ఝళిపిస్తే.. సామానంతా చెల్లాచెదురుగా పారేసి అడవిలోకి పారిపోయా. దారి తెలియకపోయినా తోటివారితో సాగిపోయా. చిమ్మచీకటి కమ్ముకున్నా.. ఇల్లు చేరేంతవరకు ఆగకూడదనుకున్నా. మేము చేసిన తప్పేంటో తెలియక.. అడుగు అడుగుకు గుండె బరువు పెరుగుతుంటే.. మోయలేక సొమ్మసిల్లిపడిపోయా. అప్పుడొచ్చింది మా ఊరికి పోయే బస్సు' అని చెప్తాడు కాబోలు!

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

Last Updated : May 22, 2020, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details