ఛత్తీస్గఢ్ ముంగేలి జిల్లాలోని క్వారంటైన్లో ఓ వలస కూలీ పాముకాటుకు బలయ్యాడు. కిర్నా గ్రామం కొత్వేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
క్వారంటైన్లో వలసకూలి.. పాముకాటుకు బలి - snake bite latest news
ఛత్తీస్గఢ్ ముంగేలిలో క్వారంటైన్లో ఉన్న ఓ వలస కార్మికుడు పాము కాటుతో మరణించాడు. మృతుడి కుటుంసభ్యులకు పరిహారం కింద రూ.4 లక్షలు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

క్వారంటైన్లో వలసకూలి పాముకాటుకు బలి
యోగశ్ వర్మ (31) అనే కూలీ శనివారం పుణె నుంచి మహారాష్ట్రకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్లో ఉంచారు అధికారులు. వరండా బయట నేలపై యోగేశ్ నిద్రిస్తుండగా.. పాము కాటు వేసిందని మంగేలీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు ప్రకటించగా.. పరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.