తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీ అధ్యక్షుడినే బంధించిన భాజపా కార్యకర్తలు

రాజస్థాన్​ నాగౌర్​ జిల్లాలో సొంతపార్టీ నేతలనే భాజపా కార్యకర్తలు చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. పంచాయతీ ఎన్నికల్లో బయటివారికి టికెట్లు ఇచ్చారని ఆ విధంగా నిరసన తెలిపారు. కార్యకర్తల డిమాండ్లను పార్టీ అగ్ర నాయకత్వానికి విన్నవిస్తామని హామీ ఇచ్చాక విడిచిపెట్టగా.. హైడ్రామాకు తెరపడింది.

Rajasthan BJP workers
భాజపా కార్యకర్తలు

By

Published : Nov 10, 2020, 12:54 PM IST

రాజస్థాన్​ నాగౌర్​ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. రాబోయే పంచాయతీ సమితి ఎన్నికల్లో బయటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్​ వైష్ణవ్​తోపాటు ఉపాధ్యక్షుడిని చెట్టుకు కట్టేసి చాలాసేపు నిర్బంధించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జెండాకు నిప్పంటించి నిరసన తెలిపారు. పార్టీ సీనియర్​ నేతల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టారు.

పార్టీ అధ్యక్షుడినే బంధించిన భాజపా కార్యకర్తలు

"మాజీ మంత్రి అజయ్​ సింగ్ మద్దతుదారుల్లో ఒకరిని నిలబెట్టాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్​సమంద్​ ఎంపీ దియా కుమారి ఆదేశాల మేరకు వీరికి టికెట్ దక్కలేదని ఆరోపించారు. పార్టీ అగ్రనాయకత్వ నిర్ణయంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు వెళ్లగా.. వాళ్లు మమ్మల్ని నిర్బంధించారు."

- రాజేశ్​ వైష్ణవ్​, భాజపా

నాగౌర్అధ్యక్షుడు

పంచాయతీ ఎన్నికల్లో తమకే టికెట్లు ఇస్తామని తమకు హామీ ఇచ్చారని ఓ కార్యకర్త చెప్పారు. కానీ, అసలైన కార్యకర్తలకు పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇదీ చూడండి:బిహార్​లో కమలనాథుల కల నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details