- నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
- విద్యా హక్కు చట్టం కింద మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి
- పాఠ్య ప్రణాళిక భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశం
- 2030 నాటికి అందరికీ విద్య అందించాలనేది లక్ష్యం
- డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయం
- డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లు
నూతన విద్యా విధానానికి కేంద్రం ఆమోదం - నూతన విద్యా విధానం
17:03 July 29
13:08 July 29
నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి విధివిధానాలను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మానవ వనరులశాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్.
నూతన విద్యా విధానం ముసాయిదా సిఫార్సుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది కేబినెట్.
కొత్త విధానం ద్వారా దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను నెలకొల్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులకు ఈ కొత్త విధానం శ్రీకారం చుట్టనుంది.