తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివకుమార్​ బెయిల్​ పిటిషన్​పై నేడు దిల్లీ హైకోర్టు తీర్పు! - Shivakumar latest News

కర్ణాటక కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ బెయిల్ పిటిషన్​ను నేడు దిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈ వ్యాజ్యంపై ఇవాళే తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్ కేసులో గత నెల 3న శివకుమార్​ను అరెస్టు చేసింది ఈడీ. జ్యుడీషియల్​ కస్టడీ కింద ప్రస్తుతం తిహాడ్​​ జైలులో ఉంచింది.

శివకుమార్​ బెయిల్​ పిటిషన్​పై నేడు దిల్లీ హైకోర్టు తీర్పు!

By

Published : Oct 23, 2019, 5:57 AM IST

Updated : Oct 23, 2019, 7:38 AM IST

మనీలాండరింగ్​ కేసులో కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ బెయిల్​ పిటిషన్​పై నేడు దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇదే వ్యాజ్యంపై ఈ నెల 17న విచారణ జరిపింది న్యాయస్థానం. వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసింది.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పటికీ కేంద్రం రాజకీయ కక్ష సాధింపుతో తనను అరెస్టు చేసిందని పిటిషన్​లో పేర్కొన్నారు శివకుమార్​. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా.. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కీలకంగా వ్యవహరించినందుకే కేంద్రం తనపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని శివకుమార్ ఆరోపిస్తున్నారు.

గత నెలలో అరెస్టు

గతేడాది సెప్టెంబరులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్​ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. పలుమార్లు ప్రశ్నించిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్​ 3న అరెస్టు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. జ్యుడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం తిహాడ్​ జైలులో ఉంచింది.

బెయిల్​ కోసం ఇదివరకే ట్రయల్ కోర్టును ఆశ్రయించారు డీకే. అయితే, శివకుమార్​కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్న ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు ఆయన బెయిల్​కు నిరాకరించింది. ట్రయల్​ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కర్ణాటక మాజీ మంత్రి.

Last Updated : Oct 23, 2019, 7:38 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details