భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ (సీఆర్పీసీ)లకు అవసరమైన సవరణలకు.. అన్ని రాష్ట్రాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కోరినట్లు ఓ అధికారి తెలిపారు.
సవరణల తర్వాత వచ్చే కొత్త చట్టాలు.. ఆధునిక ప్రజాస్వామ్యానికి తగ్గట్లు వేగంగా తీర్పులు వెలువడే విధంగా ఉండనున్నట్లు అధికారి పేర్కొన్నారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు ఉపయోగకరంగా ఉండనున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఐపీసీ, సీఆర్పీసీ భారత సాక్ష్యాధారాల చట్టం, నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రొపిక్ సబ్స్టాన్సెస్ చట్టాలను.. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సమీక్షించే అవకాశముంది.