కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వాస్తవ పరిస్థితులను వెల్లడించాలన్న దరఖాస్తుపై సమాధానమిచ్చేందుకు తిరస్కరించింది కేంద్ర హోంశాఖ. నోటీసుల వివరాలను వెల్లడిస్తే విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని స్పష్టం చేసింది.
రాహుల్ పౌరస్థితిపై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది హోంశాఖ. ఆయన పౌరసత్వంపై వచ్చిన అభియోగాలకు పక్షం రోజుల్లోగా సమాధానమివ్వాల్సిందిగా ఏప్రిల్‌లో రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
విచారణకు ఆటంకం కలిగించే వివరాలను వెల్లడించకూడదన్న సమాచార చట్టం నిబంధన ప్రకారం వివరాల వెల్లడి కుదరదని పిటిషనర్‌కు సమాధానమిచ్చింది.