తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ కేసు దోషికి క్షమాభిక్ష నిరాకరణకు కేంద్రం సిఫార్సు

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన వినయ్​ శర్మ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతిని కోరింది. క్షమాభిక్షకు నిరాకరించాలని దిల్లీ ప్రభుత్వం చేసిన సిఫార్సు​ను రాష్ట్రపతి కార్యాలయానికి ఇవాళ పంపించింది.

MHA recommends to Prez to reject mercy plea of Nirbhaya gang-rape convict
నిర్భయ కేసు దోషికి క్షమాభిక్ష నిరాకరణకు కేంద్రం సిఫార్సు

By

Published : Dec 6, 2019, 3:32 PM IST

నిర్భయ కేసు దోషి వినయ్​ శర్మ క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం చేసిన సిఫార్సును కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు పంపించింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్... క్షమాభిక్ష తిరస్కరణ ఫైల్​ను పంపిన రెండు రోజుల్లోనే హోంమంత్రిత్వశాఖ ఈ పని చేసింది. వినయ్​కు ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వొద్దని కోరుతూ అదే దస్త్రంపై రాసి పంపింది కేంద్రహోంశాఖ. ఈ సిఫార్సును రాష్ట్రపతి పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ తెలిపింది.

నిర్భయ కేసు...

23 ఏళ్ల వైద్యవిద్యార్థిని నిర్భయ 2012 డిసెంబర్ 16న సామూహిక హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదీ చూడండి:'హత్యాచారాలపై రాజకీయాలా? ఉరిశిక్ష పడాల్సిందే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details