దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపుర్లలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మూడు సరిహద్దులతో పాటు.. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి జనవరి 31 రాత్రి 11గంటల వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు.. అత్యవసర పరిస్థితిని తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.