తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టెంబర్​ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి - భారతదేశంలో లాక్​డౌన్

unlock-4
అన్​లాక్​- 4

By

Published : Aug 29, 2020, 8:03 PM IST

Updated : Aug 29, 2020, 9:03 PM IST

20:01 August 29

సెప్టెంబర్​ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి

లాక్​డౌన్​ ఎత్తివేతలో భాగంగా అన్​లాక్​- 4 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. సెప్టెంబర్​ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది.  

దశలవారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోంశాఖ అవకాశం కల్పించగా.. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.  

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.  

మార్గదర్శకాలు ఇవే..

  • విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం.
  • ఈ కార్యక్రమాల్లో వందమంది వరకు పాల్గొనేందుకు అనుమతి.
  • సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు అనుమతి.
  • సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి
  • వచ్చే నెల 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేత
  • కొన్ని నిబంధనలతో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి
  • పాఠశాలకు వెళ్లి ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు అనుమతి
  • సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూళ్లు తెరిచేందుకు అనుమతి లేదు

స్థానిక లాక్‌డౌన్‌లు వద్దు..

కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయిస్తే స్థానికంగా ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని రాష్ట్రాలకు/ కేంద్ర ప్రాంతాలకు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇదీ చూడండి:సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ

Last Updated : Aug 29, 2020, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details