ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో.. ప్రయాణాల్లో భాగంగా పాటించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను(ఎస్ఓపీ) కేంద్ర హోంశాఖ జారీ చేసింది. వైరస్ లక్షణాలు లేనివారు, చెల్లుబాటయ్యే టికెట్ ఉన్నవారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.
"నిర్ధరించిన ఈ-టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి లభిస్తుంది. ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ జరిగేలా రైల్వే శాఖ జాగ్రత్త వహిస్తుంది. లక్షణాలు లేని వారినే ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు." -హోంశాఖ ఎస్ఓపీ
- స్టేషన్లోకి ప్రవేశించిన సమయం నుంచి గమ్య స్థానాలకు చేరుకునే వరకు ప్రయాణికులందరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలి.
- స్వస్థలాలకు చేరుకున్న అనంతరం ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు పాటించాలి.
- స్టేషన్లతో పాటు రైల్వే కోచ్లలో ప్రయాణికులందరికీ శానిటైజర్లు అందించనున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది.