తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ ఎన్​పీఆర్​: శుక్రవారం కేంద్రం కీలక సమావేశం

ఏప్రిల్​లో చేపట్టనున్న జాతీయ జనాభా పట్టిక సహా జనగణనపై చర్చించడానికి కేంద్రం రేపు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశంలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనేది లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

MHA convenes meet to discuss modalities for census, NPR
ఆపరేషన్​ ఎన్​పీఆర్​: శుక్రవారం కేంద్రం కీలక సమావేశం

By

Published : Jan 16, 2020, 6:10 PM IST

జనాభా లెక్కింపు సహా జాతీయ జనభా పట్టిక(ఎన్​పీఆర్)పై చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో శుక్రవారం ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, జనగణన డైరక్టర్లు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్న జనాభా లెక్కింపు విధివిధానాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

'మేం రాం'

అయితే ఈ సమావేశంలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనరని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. బంగాల్​తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎన్​పీఆర్​ అమలును వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ పౌర పట్టిక రూపొందించడానికి తొలి దశ ఎన్​పీఆరేనని ఆరోపిస్తున్నాయి.

ప్రక్రియ ఏంటంటే?

దేశంలో ఉన్న ప్రజల సమగ్ర సమాచార డేటాబేస్​ను రూపొందించడమే జనాభా పట్టిక ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. జనాభా వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆరు నెలలుగా ఒకే ప్రాంతంలో నివసించిన వ్యక్తులను, లేదా ఒక ప్రాంతంలో ఆరు నెలలు ఉండాలనుకుంటున్న వ్యక్తులను స్థానికులుగా గుర్తిస్తారు.

అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్​-సెప్టెంబర్​ మధ్య ఎన్​పీఆర్​ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే రూ.3,941.35 కోట్లు కేటాయించింది.

ఇదీ చదవండి: చర్చలతోనే వివాదాలకు తెర: ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details