తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జిన్నా' హోటల్​లో అగ్గి - హోటల్​

పాకిస్థాన్​ వ్యవస్థాపకుడు మహమ్మద్​ జిన్నా ఒకప్పుడు బస చేసిన హోటల్​లో అగ్నిప్రమాదం సంభవించింది. అసలు యజమాని పాకిస్థాన్​కు వెళ్లినప్పటి నుంచి ఈ హోటల్​ ఆస్తుల కేసు కోర్టులో నడుస్తోంది.

హోటల్​లో ఎగిసిపడుతున్న మంటలు

By

Published : Mar 5, 2019, 11:37 AM IST

ఉత్తరాఖండ్​ నైనిటాల్​లోని ప్రాచీన మెట్రోపోల్​ హోటల్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం​ దాదాపు పూర్తిగా దగ్ధమైంది.

కొన్నేళ్లుగా హోటల్​ ప్రధాన భవనంలో వర్తక పన్ను కార్యాలయం నడుస్తోంది. రాత్రి అగ్నిప్రమాదం జరిగింది ఆ కార్యాలయంలోనే. ప్రమాద కారణాలను ఇంకా కనుగొనలేదని, ఎవరో దుండగులు కావాలనే నిప్పు పెట్టారని అనుమానిస్తున్నట్టు నైనిటాల్​ సీఐ విజయ్​ థాపా చెప్పారు.

చాలా ఏళ్లు ఖాళీగా...

ఎంతో విలాసవంతమైన ఈ హోటల్​ అంటే పాకిస్థాన్​ వ్యవస్థాపకుడు మహమ్మద్​ అలీ జిన్నాకు చాలా ఇష్టం. ఆయన చాలా రోజులు ఇక్కడ బస చేశారు. ఇక్కడే జిన్నా హనీమూన్​ చేసుకున్నారు. మరెంతో మంది ప్రముఖులు, సినీతారలు గతంలో ఈ హోటల్​ ఆతిథ్యం స్వీకరించారు.

ఎంతో ప్రాచీనమైన మెట్రోపోల్ హోటల్​ ​ చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది.​ యజమాని మహారాజా మహమూదాబాద్​ పాకిస్థాన్​కి వెళ్లిపోయాక హోటల్ ఆస్తులపై కోర్టులో కేసు నడుస్తోంది.

ప్రస్తుతం కొందరు హోటల్​ను వాహనాలు నిలుపుకునేందుకు వినియోగిస్తున్నారు. అయితే ప్రధాన కార్యాలయంలోనే ప్రమాదం సంభవించింది. వాహనాల వరకు మంటలు చేరుకోలేదు.

హోటల్​లో ఎగిసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details