భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.
దిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికైన ఈ భేటీలో రెండు దేశాల ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ సమావేశంలో భారత్, జర్మనీల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు సమాచారం.