తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మతిస్థిమితం లేని బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం - తమిళనాడులో మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గాలేని యువతి పై ఏడుగురు మైనర్​ యువకులు అత్యాచారం

ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్ల దాడి నుంచి మహిళలు తప్పించుకోలేకపోతున్నారు. కొందరు​ యువకులు మానసిక స్థితి సరిగ్గాలేని యువతిపట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించి అత్యాచారం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురంలో జరిగింది.

మతిస్థిమితం లేని బాలిక పా మైనర్లు అత్యాచారం

By

Published : Nov 7, 2019, 10:33 AM IST

తమిళనాడు రామనాథపురం జిల్లా కట్టుపల్లిలోని ఏర్వాడి దర్గా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గాలేని వారికి చికిత్స అందించడంలో ప్రసిద్ధి చెందింది. రోజూ వెయ్యి మంది ఆ దర్గాను సందర్శిస్తారు. రెండు నెలల క్రితం ఓ మూగ తండ్రి తన కూతురికి చికిత్స కోసం ఆ దర్గాను ఆశ్రయించాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు.

దర్గాకు నిత్యం వెయ్యి మంది వస్తున్నా... సరైన వసతులు లేవు. మంగళవారం రాత్రి ఆ బాలిక మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లగా ఏడుగురు యువకులు ఆమెను అడ్డుకున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి వయసు 14 నుంచి 19 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అత్యాచారం చేసిన సమయంలో నిందితులంతా గంజాయి సేవించి ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చూడండి : అసోంలో 'ఏనుగుల' పంట పండిస్తున్న దంపతులు

ABOUT THE AUTHOR

...view details