తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పద్ధతి మార్చుకోకపోతే నేరుగా శ్మశానానికే!' - బంగాల్ రాజకీయాలు

తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల లోపు టీఎంసీ కార్యకర్తలు పద్ధతి మార్చుకోకపోతే.. వాళ్ల కాళ్లు, చేతులు విరుగుతాయని, అవసరమైతే శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Dilip Ghosh
దిలీప్​ ఘోష్​

By

Published : Nov 9, 2020, 11:18 AM IST

బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమూల్​ కాంగ్రెస్ కార్యకర్తలు పద్దతి మార్చుకోకపోతే.. ఆసుపత్రికి లేదా శ్మశానానికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. హల్దియాలో నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన.. తమకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

"సామాన్యులను ఇబ్బంది పెడుతున్న తృణమూల్ కార్యకర్తలు పద్ధతి మార్చుకోవాలి. లేదంటే వాళ్ల చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవచ్చు. తలలు పగిలిపోవచ్చు. మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోతే ఏకంగా శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుంది."

- దిలీప్ ఘోష్, బంగాల్ భాజపా అధ్యక్షుడు

కేంద్రం భరోసా ఉంటుంది..

బంగాల్​ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఘోష్ అన్నారు. ఎన్నికల భద్రత రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర బలగాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఖండించిన తృణమూల్​..

రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఘోష్​ దెబ్బతీస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ రకమైన ప్రకటనలు ఉద్రిక్తలకు కారణమవుతాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వారికి గట్టి బదులిస్తారని తృణమూల్ ఎంపీ సౌగత రాయ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి:'బంగాల్​లో పౌర చట్టాన్ని అమలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details