సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై తాము ఆధారపడలేమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. కమిటీలోని సభ్యులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారేనని మండిపడ్డాయి. వారందరూ నూతన సాగు చట్టాలపై సానుకూలంగా వ్యాఖ్యానించినవారేనని పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో తాము ఏ కమిటీ ముందుకు వెళ్లమని.. దిల్లీ సరిహద్దుల్లోనే ఎప్పటిలాగే నిరసన కొనసాగిస్తామని రైతుల నేత బల్బీర్ సింగ్ రజేవాల్ మీడియాకు వెల్లడించారు. అసలు కమిటీ ఏర్పాటు చేయాలని తాము ఎన్నడూ కోరలేదని స్పష్టం చేశారు. వీటన్నిటి వెనుక కేంద్రం ఉందని మండిపడ్డారు.