గతేడాది ఆగస్టు నుంచి నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఆమె అధికారిక నివాసానికి తరలించారు అధికారులు. అయితే ముఫ్తీ నివాసాన్నే జైలుగా మార్చి.. నిర్బంధంలోనే ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.
స్వగృహంలోనూ నిర్బంధంలోనే మెహబూబా ముఫ్తీ
ఎనిమిది నెలలుగా నిర్బంధంలో ఉన్న కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కాస్త ఊరట కల్పించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రభుత్వ బంగ్లాలో ఉన్న ఆమెను స్వగృహానికి తరలించింది. అయినప్పటికీ ఆమె నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
స్వగృహంలోనూ నిర్బంధంలోనే మెహబూబా ముఫ్తీ
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పీడీపీ అధినేత్రి అయిన ముఫ్తీని.. ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కింద గతేడాది ఆగస్టు 5న ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు. అప్పటినుంచి లాల్‌చౌక్ సమీపంలోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నిర్బంధించారు. అదే బంగ్లాలోనే ఒమర్ అబ్దుల్లానూ ఉంచిన అధికారులు.. ఇటీవలే ఆయనను విడుదల చేశారు. తాజాగా ముఫ్తీని కూడా ఆమె స్వగృహానికి మార్చారు.
ఇదీ చదవండి:హజ్‌యాత్ర సొమ్ముతో అన్నార్తులకు సాయం