సరిహద్దులో సమస్యలపై భారత్, పాకిస్థాన్లు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు చేపట్టాలని కోరారు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఇరువైపుల పెరుగుతున్న ప్రాణనష్టాన్ని చూడటం చాలా విచారకమన్నారు.
ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడగా.. భారత దళాలు దీటుగా సమాధానమిచ్చాయి. ఈ ఘటనల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ముఫ్తీ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.