తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా - cm in home isolation

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మాకు కరోనా పాజిటివ్​గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్న ఆయన ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నారు.

Meghalaya CM Conrad Sangma tests positive for covid 19
మేఘాలయ సీఎంకు కరోనా పాజిటివ్​

By

Published : Dec 11, 2020, 7:27 PM IST

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా.. కొవిడ్​ బారిన పడ్డారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఆయన వెల్లడించారు. స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉండగా.. హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నట్లు చెప్పారు.

సీఎం ట్వీట్​

"నాకు కరోనా​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నాను. ఐదు రోజులుగా నన్ను కలిసిన వారందరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నాను. అవసరమైతే పరీక్షలు చేయించుకోండి."

-- కాన్రాడ్​ సంగ్మా

దేశవ్యాప్తంగా కొత్తగా 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 414 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 97 లక్షల 96 వేలు దాటింది.

ఇదీ చూడండి:ఛత్తీస్​గఢ్​ సీఎం పీఠం వీడనున్న బఘేల్?

ABOUT THE AUTHOR

...view details