తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు దశాబ్దాలుగా రామమందిరం సేవలోనే కరసేవకులు - Bhoomi Pujan

అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో భాగంగా నేడు భూమిపూజ చేయనున్నారు. అయితే కరసేవకుడైన అన్నుభాయ్​.. గత 30 ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం స్తంభాలను చెక్కే పనిలోనే ఉన్నట్లు తెలిపారు. ఆయన బృందం తయారు చేసిన శిల్పాలు, స్తంభాలతోనే మందిరం నిర్మించనున్నారు.

Meet the kar sevak who spent 30 years carving stones for Ram Temple
30 ఏళ్లుగా రామమందిరం సేవలోనే కరసేవకులు..

By

Published : Aug 5, 2020, 6:36 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామమందిరం భూమిపూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఎన్నో ఏళ్ల నాటి తన కల సాకారం అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు కరసేవకుడు 80 ఏళ్ల అన్నుభాయ్​ సోమ్​పుర.

గత 30 ఏళ్లుగా..

అయోధ్యలోని కరసేవకపురానికి దగ్గర్లోనే శ్రీ రామ మందిరం నిర్మాణ వర్క్​షాప్​ ఉంది. 1992లో శ్రీ రామ్​ జన్మభూమి న్యాస్ సభ్యులు​ దీన్ని స్థాపించారు. అప్పట్నుంచి ఇక్కడ మందిరం కోసం రాళ్లు చెక్కుతున్నారు.

అయోధ్యలోని మందిరాన్ని దర్శించిన భక్తులు.. వర్క్​షాప్​ను కూడా సందర్శిస్తారు. దీనికి అన్నుభాయ్​ సూపర్​వైజర్​. 50 ఏళ్ల వయసులో అయోధ్య మందిరం నిర్మాణం కాంట్రాక్ట్​ను తీసుకున్నారు. ఇందులో భాగంగా 1990లో రామ మందిరం ​కోసం ప్లాన్ సిద్ధం చేశారు. వీటితో పాటు వర్క్​షాప్​లో​ స్తంభాలు, శిల్పాలు చెక్కే పనులనూ ఆయన పర్యవేక్షిస్తుంటారు.

30 ఏళ్లుగా రామమందిరం సేవలోనే కరసేవకులు..

ఊపిరితిత్తుల సమస్యలతో...

గత 30 ఏళ్లలో ఇద్దరు శిల్పకారులు వర్క్​షాప్​లోనే మృతిచెందారు. రెండూ సాధారణ మరణాలే. 2001లో ఒకరు, 2019లో మరొకరు చనిపోయారు. రాళ్ల నుంచి వచ్చే ధూళి కారణంగా సిబ్బందిలో కొంతమంది సిలికోసిస్​ టీబీ బారిన పడ్డారు. మరికొందరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు.

చాలా రాళ్లు అవసరం...

ఇప్పటివరకు మందిరంలోని ఒక అంతస్తు కట్టడానికి సరిపడా రాతి స్తంభాలు మాత్రమే సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రెండో అంతస్తు కోసం రాళ్లను సిద్ధం చేస్తున్నారు. పాత మందిరంలో 1.75 లక్షల క్యూబిక్​ అడుగుల మేర మాత్రమే రాతిని ఉపయోగించగా.. తాజాగా దాన్ని 3 లక్షల క్యూబిక్​ అడుగులకు పెంచేశారు. అన్ని రాళ్లను రాజస్థాన్​ నుంచే తెస్తున్నారు.

నిరంతరాయంగా పనిచేస్తూనే...

వర్క్​షాప్​ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ మూతపడలేదని అన్నుభాయ్​ చెప్పారు. ఆరంభంలో 50 మంది కళాకారులు పనిచేసేవారు. అయితే పని ఒత్తిడి పెరగడం వల్ల ప్రస్తుతం 150 మంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details