తన జీవితమంతా వంటింటికే పరిమితమై, కుటుంబ అవసరాలను చూసుకున్న తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాడు ఓ తనయుడు. అందుకు తగ్గట్టుగా దేశం మొత్తం తిప్పి, తల్లిని ఆశ్చర్యపర్చాలనుకున్నాడు. అభినవ శ్రవణుడిగా మారి 20 ఏళ్లనాటి స్కూటర్‌ను అందుకు ఎంచుకొని, తన ప్రయాణాన్ని సాగించాడు. భారత్ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ప్రదేశాలను తన తల్లికి తనివితీరా చూపిస్తూ.. 56,552 కిలో మీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
ఈ మాతృప్రేమ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ కుమారుడు తల్లి పట్ల చూపిస్తోన్న అభిమానానికి పొంగిపోయిన ఆనంద్.. వారికి ఒక కారు బహుమతిగా ఇస్తానని గత సంవత్సరం వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శుక్రవారం 'మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్'ను వారికి అందజేశారు.
ఇదీ జరిగింది..
కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన క్రష్ణ కుమార్ ఒకప్పుడు కార్పొరేట్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేసేవారు. ఎప్పుడూ ఇంటి బాధ్యతలకే పరిమితమైన తల్లి చూడారత్న రుణం కొంతైనా తీర్చుకోవాలనుకున్నారు. 'మాతృ సేవా సంకల్ప యాత్ర' పేరుతో తన తల్లికి కొత్త లోకాన్ని పరిచయం చేయాలనుకున్నారు. అందుకు తగట్టుగానే 20 ఏళ్ల క్రితం తన తండ్రి బహుమతిగా ఇచ్చిన ఓ స్కూటర్‌ను దానికి వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి ఆ స్కూటర్‌పై మొత్తం 56,552 కిలో మీటర్లు ప్రయాణించారు.
మాట నిలబెట్టుకున్న మహీంద్రా..
అయితే, ఈ అభినవ శ్రవణుడి గురించి గత సంవత్సరం అక్టోబర్‌లో ఆనంద్ మహీంద్రాకు తెలిసింది. వెంటనే ఆయన వీరికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. "ఇది ఒక అందమైన కథ. తల్లిపై, దేశంపై ఓ వ్యక్తికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. ఆయనకు నేను మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇక నుంచి తన తల్లిని కారులో తిప్పుతారు" అని ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం కారును బహుమతిగా ఇచ్చి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
స్కూటర్ నుంచి కారు..
ఆనంద్ మహీంద్రా బహుమతిపై కృష్ణ కుమార్ స్పందించారు.