తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

మహారాష్ట్రలోని భడ్లి బుద్రుక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ హిజ్రా గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్రంలో పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన తొలి హిజ్రాగా ఘనత పొందారు.

transgender, maharashtra
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా గెలుపు

By

Published : Jan 20, 2021, 11:41 AM IST

మహారాష్ట్రలోని జలగావ్​ జిల్లా భడ్లి బుద్రుక్​ గ్రామంలో ఓ హిజ్రా గ్రామ పంచాయతీ సభ్యలుగా ఎన్నికయ్యారు. అంజలి అనే వ్యక్తి మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన తొలి హిజ్రాగా ఘనత సాధించారు. జనవరి 15న పోలింగ్​ జరగ్గా.. సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'​తో అంజలి తన అనుభవాలను పంచుకున్నారు.

"గ్రామస్థులు నాపై నమ్మకంతో ఎన్నుకున్నారు. వారికి నేను రుణపడి ఉంటా. ఇప్పుడు నా బాధ్యతలు పెరిగాయి. గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. గ్రామస్థులకు కనీస వసతులు అందించడం సహా అంగన్​వాడీలు, వైద్య సదుపాయాలను మెరుగు పరచడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తా."

-అంజలి, భడ్లి బుద్రుక్ గ్రామ పంచాయతీ సభ్యులు

మాకు ప్రేరణ..

అంజలి విజయం పట్ల తోటి హిజ్రాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజును తాము మరిచిపోలేమని పేర్కొన్నారు. అంజలిని ప్రేరణగా తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని షాంబ్ పాటిల్ అన్నారు.

ముందు తిరస్కారం..

వార్డు నెంబర్​.4 నుంచి పోటీ చేసేందుకు మొదట మహిళల జనరల్ కేటగిరీలో అంజలి నామినేషల్​ దాఖలు చేశారు. అయితే ఆ దరఖాస్తును ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్​ వేయగా.. కోర్టు అంజలికి సానుకూలంగా తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి :బైడెన్​ బృందంలో ట్రాన్స్​జెండర్​కు చోటు​

ABOUT THE AUTHOR

...view details