కేరళ పాలక్కడ్‌లో ఓ శునకం వాలీబాల్ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. రోజు తన యజమాని వాలీబాల్ ఆడడం చూసి ప్రేరణ పొందిన ఈ గ్రామసింహం ఆటలో తాను ఓ ప్లేయర్‌ని అని ఆటగాళ్లకు గుర్తు చేస్తోంది. బాల్ వచ్చిన ప్రతిసారి ఎగిరెగిరి షాట్లు కొడుతూ... తన నైపుణ్యం చూపిస్తోంది.
కైజర్ అని ముద్దుగా పిలుచుకునే ఈ శునకంతో ఆడేందుకు చుట్టుపక్కల వారు క్యూలు కడుతున్నారు అని అంటున్నారు యజమాని మొబిన్