జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం - kashmir encounter today
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
09:12 June 18
అవంతిపొరాలో ముష్కరుడి హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. జిల్లాలోని పాంపోర్‌లో భద్రతా బలగాలు నిన్న రాత్రి తనిఖీలు చేపడతుండగా మసీదును ఆనుకుని ఉన్న భవనంలో ఉగ్రవాదులు తారసపడ్డారు.
ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా బలగాలు ప్రతిఘటించాయి. ఆ భవనంపై ఒక గ్రెనేడ్‌తో దాడి చేయగా.. ఉగ్రవాదులు తొలుత మసీదులోకి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ముష్కరులు పక్కన ఉన్న ఒక షెడ్లోకి వెళ్లగా బలగాలు తిరిగి కాల్పులను ప్రారంభించాయి.
Last Updated : Jun 18, 2020, 10:59 AM IST