తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్యవర్తిత్వం కాదు... ఆర్డినెన్స్​ అవసరం' - SAMNA

అయోధ్య భూవివాదంపై సుప్రీం నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్​పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని రాజకీయ నాయకులు, సుప్రీం కోర్టు ఇవ్వని పరిష్కారం ముగ్గురి వల్ల ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కేంద్రాన్ని మరోసారి కోరింది.

శివసేన

By

Published : Mar 9, 2019, 6:41 PM IST

Updated : Mar 9, 2019, 8:27 PM IST

మధ్యవర్తిత్వ ప్యానెల్​పై శివసేన అసంతృప్తి
రామ జన్మభూమి కేసు ఓ భావోద్వేగ అంశమని, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేక ఆర్డినెన్స్​ ద్వారా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని కోరింది.

"దేశంలోని ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయారు. సుప్రీం కోర్టు కూడా ఇన్నేళ్లుగా ఈ సమస్యకు సమాధానం చూపలేకపోయింది. ఇప్పుడు ముగ్గురి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం ఎలా వస్తుంది" అని శివసేన వ్యాఖ్యానించింది.

అయోధ్య వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీపై అధికారిక పత్ర సామ్నాలో పలు ప్రశ్నలు లేవనెత్తింది శివసేన.

"మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వచ్చేట్లయితే 25 ఏళ్ల నుంచి పరిష్కారం ఎందుకు కాలేదు?దీని కారణంగా వందలాది మంది ప్రాణాలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది?
ఈ వివాదంపై ఇన్నేళ్లుగా నిరసనకారులు మధ్యవర్తిత్వాన్ని కోరలేదు. అలాంటప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేంటి? రామ జన్మభూమి అయోధ్య సమస్య భూవివాదం మాత్రమే కాదు భావోద్వేగాలతో కూడిన అంశం. మధ్యవర్తిత్వం వంటి నిర్ణయాలు ఇలాంటి అంశాల్లో పని చేయవు." -సామ్నా, శివసేన అధికార పత్రిక

Last Updated : Mar 9, 2019, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details