ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్ట్రియాలోని భారత రాయబారిపై కేంద్రం వేటు - ఆస్ట్రియాలోని భారత రాయబారిపై కేంద్రం వేటు

ఆస్ట్రియాలోని భారత రాయబారిపై విదేశాంగశాఖ వేటు వేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంతో పాటు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమెను దిల్లీకి తిరిగి రప్పించింది. ఆర్థిక అధికారాలపైనా ఆంక్షలు విధించింది.

MEA sacked Indian foreign affairs secretory of Astria  due to miss use of public funds
ఆస్ట్రియాలోని భారత రాయబారిపై కేంద్రం వేటు
author img

By

Published : Dec 30, 2019, 4:21 PM IST

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణు పాల్‌ను విదేశాంగ శాఖ అర్ధంతరంగా వెనక్కి పిలిచింది. ఆమెను దిల్లీకి పిలిపించి, ఆర్థిక అధికారాలపై ఆంక్షలు విధించింది.

కేంద్ర విజిలెన్స్ కమిషన్​ దర్యాప్తు

1988 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ రేణు పాల్‌ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలలో ఆమె పదవీ కాలం ముగియనుంది. గత కొంతకాలంగా రేణు పాల్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినందున కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆమెపై దర్యాప్తునకు ఆదేశించింది. రేణు పాల్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇంటి అద్దెకు రూ.15 లక్షలు

శాఖాపరమైన అనుమతులు తీసుకున్నట్లు తప్పుగా చూపించి పెద్ద ఎత్తున వ్యాట్‌ రీఫండ్‌లు చేసుకున్నారని నివేదికలో విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఇంటి అద్దె కోసమే నెలకు 15లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details