తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఐరాస పోస్టల్ స్టాంప్​ విడుదల - UNO 75th anniversary

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్​.. పోస్టల్​ స్టాంప్​ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో ఐరాస దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రశంసించారు.

MEA S Jaishankar to release commemorative postage stamp
భారత్​లో ఐరాస పోస్టల్ స్టాంప్​ విడుదల

By

Published : Oct 24, 2020, 6:20 AM IST

ఐక్యరాజ్యసమితి(ఐరాస) 75వ వార్షికోత్సవం పురస్కరించుకుని పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది భారత్. ఈమేరకు పోస్టల్‌ విభాగం ముద్రించిన స్టాంప్‌ను విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రదర్శించారు. ఐరాస వ్యవస్థాపక సభ్యదేశంగా ఉన్న భారత్... సమితి చేపట్టిన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

యూఎన్‌ ఛార్టర్‌లోని మౌలిక సూత్రాలను విధిగా పాటించడం సహా ఐరాస శాంతి దళాలకు న్యాయకత్వం వహించినట్లు వివరించారు జైశంకర్​. ఐరాస 75వ వార్షికోత్సవం వేళ భద్రతా మండలిలో భారత్​ తాత్కాలిక సభ్య దేశంగా ఉండటం గొప్ప విషయమన్న జైశంకర్.​. ప్రపంచ దేశాలను ఒకే గొడుగు కిందకు తేవడంలో దశబ్దాలుగా ఐరాస కృషి చేస్తోందని ప్రశంసించారు.

గతంలోనూ యూఎన్ 40 , 50 వార్షికోత్సవాల సందర్భంగా భారత పోస్టల్‌ విభాగం స్టాంప్‌లు విడుదల చేసింది.

ఇదీ చూడండి:రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్​

ABOUT THE AUTHOR

...view details