కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీపై ఉగ్రవాదుల దాటి వెనుక భారత స్లీపర్ సెల్స్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. అవి పనికిమాలిన వ్యాఖ్యలని కొట్టిపారేసింది.
"సొంత దేశంలో సమస్యలను పెట్టుకుని భారత్‌ను నిందించటం సరికాదు. ఖురేషీవి అసంబద్ధ వ్యాఖ్యలు. కరాచీలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా భారత్ ఖండిస్తుంది. మీ ప్రధానే స్వయంగా... అంతర్జాతీయ ఉగ్రవాదులను అమరవీరుడిగా అభివర్ణించారు. కాబట్టి ఉగ్రవాదంపై మీ ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి."
-అనురాగ్ శ్రీ వాస్తవ, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి.