ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్‌లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్, హాంగ్‌కాంగ్‌లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ప్రకటించారు.
షాకింగ్ న్యూస్: మరో 276 మంది భారతీయులకు కరోనా - Middle East Respiratory Syndrome
ఇరాన్లో దాదాపు 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు తాజాగా వెల్లడించింది విదేశాంగ శాఖ. ఇటలీ, యూఏఈ, రువాండా, శ్రీలంక, కువైట్, హాంగ్‌కాంగ్ తదితర దేశాలను కలిపి మొత్తం దాదాపు 276మంది భారతీయులకు ఈ మహమ్మారి సోకినట్లు ప్రకటించింది.

మరో 276 మంది భారతీయలకు కరోనా!
చైనాకు లక్షల మాస్కులు
చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్‌కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్.