మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశాన్ని పునఃపరిశీలించనున్నట్లు బహుజన్ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తోన్న మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు మద్దతుపై పునఃపరిశీలిస్తా: మాయావతి - మద్దతు
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చే విషయాన్ని పునఃపరిశీలించనున్నట్లు బహుజన్ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. రాష్ట్రంలోని గుణ లోక్‌సభ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంలో భాజపాకు కాంగ్రెస్ ఏ మాత్రం తీసిపోదని మాయావతి విమర్శించారు. గుణ లోక్‌సభ స్థానంలో బీఎస్పీ అభ్యర్థిని భయపెట్టి పోటీ నుంచి విరమించుకునేటట్లు కాంగ్రెస్ చేసిందని మాయావతి ఆరోపించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా 114 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్ సాధారణ మెజార్టీకి రెండు స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే, నలుగురు స్వతంత్ర సభ్యుల మద్దతుతో కాంగ్రెస్‌పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
- ఇదీ చూడండి: వడదెబ్బ తగిలిన పక్షుల కోసం ఆసుపత్రి