క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతిపక్షాలు జమ్ముూకశ్మీర్ వెళ్లడాన్ని తప్పుబట్టారు బహుజన్ సమాజ్ వార్టీ అధినేత్రి మాయావతి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో సాధారణ పరిస్తితులు నెలకొనడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అప్పటి వరకు ప్రతి పక్షాలు తొందర పడకుండా వేచి చూస్తే బాంగుండేదని ఆమె ట్వీట్ చేశారు.
రాహుల్‌పై మండిపాటు
జమ్మూ కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సహా పలువు విపక్ష నేతలు కశ్మీర్‌కు వెల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి. రాహుల్ కశ్మీర్ వెళ్లిన తీరును కేంద్రం రాజకీయం చేసే అవకాశాలున్నాయని ఆమె ఆరోపించారు.