తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థులకు చట్టమంటే భయమే లేదు' - latest news on unnao rape case

ఉత్తర్​ప్రదేశ్​ అత్యాచార ఘటనలు సర్వ సాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. చట్టమంటే నేరస్థులకు భయం లేదన్నారు ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి. ఉన్నావ్​ ఘటనపై గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​ను కలిసి లేఖ సమర్పించారు మాయ.

Mayawati
'ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థులకు చట్టమంటే భయమే లేదు'

By

Published : Dec 7, 2019, 4:15 PM IST

Updated : Dec 7, 2019, 5:00 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో చట్టాలపై నేరస్థులకు భయం లేదని.. అత్యాచార ఘటనలు సాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బహుజన సమాజ్​ పార్టీ అధినేత్ర మాయావతి. ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టి హతమార్చిన ఘటనను బీఎస్పీ పార్టీ ఖండిస్తోందన్నారు.

ఉన్నావ్​ ఘటనపై రాష్ట్ర గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​ను కలిశారు మాయావతి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల రక్షణకు తక్షణమే బాధ్యత తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్న అంశంపై గవర్నర్​కు లేఖ అందించారు.

బహుజన సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి

" ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం అపరాధమే నిండిపోయింది. చట్టాలపై నేరస్థుల్లో అసలు భయం లేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. బలాత్కార ఘటనలు సాధారణంగా మారిపోయాయి. ఈ రోజు గవర్నర్​ను కలిశాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి.. ఆటవిక పరిపాలన నడుస్తోందని, మహిళలకు అసలు రక్షణ లేదని.. ఈ అంశంపై ఓ మహిళగా, గవర్నర్​ స్థానంలో ఉన్నందున.. పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరాం. ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీసులతో సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ కల్పించాలని ఆదేశించాలని విన్నవించాం. ఈ విషయంపై గవర్నర్​కు లేఖ అందించాం."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి.

ఇదీ చూడండి: పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులపై దాడి!

Last Updated : Dec 7, 2019, 5:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details