తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా భయంతో ఊరంతా గుండు కొట్టించుకున్నారు! - corona news rajastan

కరోనా మహమ్మారి ఏ దిక్కు నుంచి వస్తుందోనని జనం వణికిపోతున్నారు. గ్రామాల్లో కొత్తవారు వస్తే వారి నుంచి ఈ వైరస్​ వచ్చే అవకాశం ఉంటుందని బెంబేలెత్తిపోతున్నారు. ఆ భయంతోనే రాజస్థాన్​లోని ఓ గ్రామంలో అందరూ గుండు చేయించుకున్నారు.

mayapur villagers take off their hair to identify new comer in  ajmer, rajastan
కరోనా భయంతో ఊరు ఊరంతా గుండు కొట్టించుకున్నారు!

By

Published : Apr 17, 2020, 8:13 AM IST

కరోనా కట్టడి కోసం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ సమీపంలో ఉన్న మాయాపూర్‌ గ్రామస్థులు.. తమ ఊళ్లోకి కొత్తవారు రాకుండా సరికొత్త ఆలోచన చేశారు. ఎవరైనా బయటివారు వస్తే తేలికగా గుర్తించడానికి వీలుగా.. ఈ గ్రామస్థులంతా గుండ్లు చేయించుకున్నారు.

బయటి నుంచి వచ్చే వారిని గుర్తించడం ఇప్పుడు సులభమని.. జట్టు ఉంటే కొత్తవాళ్లని తెలిసిపోతుందని వెంటనే వారిని పంపించేయడానికి వీలవుతోందని చెబుతున్నారు.

కరోనా భయంతో ఊరు ఊరంతా గుండు కొట్టించుకున్నారు!

ఇదీ చదవండి:లాక్​డౌన్​ వేళ కూతపెట్టనున్న ప్రత్యేక రైళ్లు!

ABOUT THE AUTHOR

...view details