తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం- భావోద్వేగంతో కుమార్తె ట్వీట్​

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆర్ అండ్ ఆర్​​ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ.

May God do whatever is best for him: Pranab Mukherjee's daughter
'విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం.. భావోద్వేగంతో కూతురి ట్వీట్​'

By

Published : Aug 12, 2020, 1:28 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి ఆందోళనకరంగానే ఉందని దిల్లీ ఆర్మీ ఆర్ ​అండ్ ​ఆర్​ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను వెంటిలేటర్​పైనే ఉంచి.. చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

కుమార్తె భావోద్వేగం..

ప్రణబ్​ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ.. తండ్రి కోలుకోవాలని కాంక్షిస్తూ ట్విట్టర్​లో భావోద్వేగ పోస్ట్ చేశారు.

"గతేడాది ఆగస్టు 8న అత్యంత సంతోషకరమైన రోజు. ఆ రోజు నాన్న.. భారత అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్నారు. సరిగ్గా సంవత్సరం గడిచేసరికి ఆయన ఆరోగ్యం విషమించింది.

ఆనందాన్ని, దుఃఖాన్ని... రెండింటినీ సమానత్వంతో అంగీకరించేలా దేవుడు నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు."

- షర్మిష్ఠ ముఖర్జీ

ఇదీ చూడండి:రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ABOUT THE AUTHOR

...view details