తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చప్పన్ భోగ్' ఉత్సవం చంద్రయాన్​-2కు అంకితం - chandrayan-3

ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో నిర్వహిస్తున్న 'చప్పన్ భోగ్' ఉత్సవాన్ని చంద్రయాన్-2కు అంకితమిచ్చారు అక్కడి ప్రజలు. ఈ ఏడాది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఇస్రో శాస్త్రవేత్తలకు ఆహ్వానం పంపినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఛప్పన్ భోగ్ ఉత్సవం చంద్రయాన్​-2కు అంకితం

By

Published : Sep 10, 2019, 7:36 AM IST

Updated : Sep 30, 2019, 2:15 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో ఎంతో ప్రత్యేకమైన 'చప్పన్ భోగ్' ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకను ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2కు అంకితం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు శ్రీ గిరిరాజ్ సేవా సమితి స్థాపకులు, అధ్యక్షులు మురారి అగర్వాల్ వెల్లడించారు.

ప్రధాని మోదీతో పాటు, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రాజెక్టులలో భాగస్వాములుగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకూ ఆహ్వానం పంపినట్లు తెలిపారు అగర్వాల్. ఆలయ గర్భగుడిలో చంద్రయాన్-3 నమూనాతో రత్నాలు, ఆభరణాలను అలంకరించనున్నట్లు చెప్పారు.

మూడు రోజుల ఉత్సవం

నేడు ప్రారంభం కానున్న చప్పన్ భోగ్ ఉత్సవం మూడురోజుల పాటు జరగనుంది. గోవర్ధన పర్వతం చుట్టూ సుమారు 23 కిలోమీటర్లు శ్రీ కృష్ణడిని రథంపై ఊరేగిస్తారు. దాదాపు 4 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వేడుక కోసం 56 రకాల ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఆవు నెయ్యి, ఇతర పదార్థాలతో 21వేల కిలోల ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు. తయారీ కోసం లఖ్​నవూ, ఆగ్రా, ఇండోర్​, రత్లం, మధురై నుంచి నిపుణులను తీసుకువచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు.

ఇదీ చూడండి:శ్వేత నాగు ఊళ్లోకి వచ్చి బుసలు కొట్టింది!

Last Updated : Sep 30, 2019, 2:15 AM IST

ABOUT THE AUTHOR

...view details