చంద్రయాన్ కోసం కృష్ణుడికి 56 వంటకాలతో నైవేద్యం ఉత్తర్ప్రదేశ్ మథురలో ఏటా జరిగే ఛప్పన్ భోగ్ పండుగను ఈసారి ఇస్రోకు అంకితమిచ్చి భరతమాతపై ప్రేమను చాటారు గిరిరాజ్ సేవా సమితి సభ్యులు.
ప్రాంగణ అలంకరణలో భాగంగా చంద్రయాన్ రాకెట్ ప్రత్యేక నమూనాను ఏర్పాటు చేశారు. లక్షల్లో హాజరైన భక్తులు భవిష్యత్లో ప్రయోగించబోయే చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడ్ని చేరేలా చూడాలని ఆ చిన్ని కృష్ణుడ్ని వేడుకున్నారు. సంప్రదాయం, శాస్త్రీయత ఒకే చోట ఉట్టిపడ్డ ఈ కార్యక్రమానికి ఇస్రో శాస్త్రవేత్త కె. సిద్ధార్థ్ కుటుంబసమేతంగా విచ్చేశారు.
శ్రీకృష్ణుడికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాన్ని ఛప్పన్ భోగ్ అంటారు. ద్వాపర యుగంలో కొంటె కృష్ణుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆహార పదార్థాలు సమర్పించి, తమ కోరికలను తీర్చమని అడిగేవారట. ఆహార ప్రియుడైన కన్నయ్య అవి కడుపారా తినేసి వారి మనోవాంఛలను సిద్ధించేవాడట. అందుకే, అనాథిగా ఇలా భోగ్ సమర్పిస్తారు భక్తులు.
ఈసారి 56 రకాల వంటకాలు నల్లనయ్యకు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నెయ్యితో 21 వేల కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు.
ఇదీ చూడండి: ఓనమ్ ప్రత్యేకం: ఈదకుండా కొలను దాటినవారే విజేత