అయోధ్యలో రామ మందిర సమస్యను పరిష్కారమైనట్లుగా మథుర, కాశీలోని మందిరాలకూ కూడా స్వేచ్ఛ లభించాలని భాజపా నేత జైభాన్ సింగ్ పవైయా అన్నారు. మథుర, కాశీలోని ఆలయాలు... ఇతర ప్రార్థనా మందిరాలకు ఆనుకొని ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ జైభాన్.. ఈ రెండు మందిరాలను మొఘలులు తమ పాలనలో అవమానించారని వ్యాఖ్యానించారు. దీనిపై దేశంలోని హిందువుల హృదయాలు వేదనకు గురవుతున్నాయని అన్నారు.
"రామ మందిర నిర్మాణానికి దారి కనుగొన్న తరహాలోనే ఈ రెండు మందిరాలను పునరుద్ధరించాలి. ఈ రెండు మందిరాలు పూర్తిగా విముక్తి పొందాలి."