తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 9:28 AM IST

Updated : Jun 9, 2020, 9:48 AM IST

ETV Bharat / bharat

కరోనా ట్రెండ్: ఇక మైక్రో వెడ్డింగ్​లదే హవా!

కరోనా కారణంగా పెళ్లి వేడుక జరుపుకునే తీరే మారిపోయింది. బంధువులందరినీ పిలవలేని పరిస్థితి. మాస్క్​ లేకుండా శుభకార్యం కొనసాగదు. శానిటైజర్​, థర్మల్​ స్క్రీనింగ్​ వంటి జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా మహమ్మారి కాటేస్తుందేమోనన్న భయం. ఎక్కువ మందిని వివాహానికి ఆహ్వానించాలన్నా ఇదే గుబులు. ఈ నేపథ్యంలోనే కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూనే.. పెళ్లిళ్లు ఘనంగా జరిపించేందుకు వినూత్న ఆలోచనలను తెరపైకి తెచ్చారు వెడ్డింగ్​ ప్లానర్లు. అవేంటో చూసేద్దాం..

Matching masks, live streaming, limited guests: Wedding planners setting new trends in Bengaluru
కరోనా దెబ్బతో వివాహ శుభకార్యాల్లో కొత్త ట్రెండ్

మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం 'పెళ్లి'. అందుకే అందరూ వివాహ శుభకార్యాన్ని ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. కొందరైతే సమస్త బంధుమిత్రులను ఆహ్వానించి.. 5 రోజులు, 16 రోజులపాటు పెళ్లి వేడుక జరుపుకుంటారు. అయినవారందరి మధ్య కనువిందుగా పెళ్లి జరుగుతుంటే.. ఫంక్షన్​ హాళ్లు కోలాహలంగా మారిపోతుంటాయి.

కానీ కరోనా మహమ్మారి కారణంగా.. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వైరస్​ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాల్సి వస్తోంది. బంధుమిత్రులందరినీ పెళ్లికి పిలవలేకపోతున్నాం. 5 రోజులు, 16 రోజుల పాటు పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ప్రస్తుతం అందరూ ఫంక్షన్​ హాళ్ల సంస్కృతిని వీడి.. పూర్వం జరుపుకున్నట్లుగానే ఫామ్​హౌస్​, గార్డెన్స్​, ఇంటి భవనంపై ఉండే ఖాళీ స్థలాల్లోనే వివాహం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగానే వెడ్డింగ్​ ప్లానర్లు సైతం వినూత్న ఆలోచనలతో తెరపైకి వస్తున్నారు. ఫలితంగా.. వైక్రో వెడ్డింగ్​, ప్రత్యక్ష ప్రసారం, పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు దుస్తులకు మ్యాచ్​ అయ్యేలా మాస్క్​లు దర్శనమిస్తున్నాయి.

వధూవరులకు ప్రత్యేక మాస్క్​లు

" ప్రస్తుతం మైక్రో వెడ్డింగ్​ ట్రెండింగ్​లో ఉంది. ఇందులో వధూవరులకు అత్యంత ఆత్మీయులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివాహానికి కేవలం 50 మందినే అనుమతిస్తున్నాం. పెళ్లికి ప్రత్యక్షంగా హాజరుకాలేని వారికి గిఫ్ట్​ బాక్స్​లతో కూడిన ఉత్తరాలను పంపిస్తున్నాం. ప్రభుత్వ నియమాల కారణంగా మిమ్మల్ని పెళ్లికి ఆహ్వానించలేకపోతున్నాం అని లేఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకప్పుడూ అందరూ ఫంక్షన్​ హాళ్లలో వివాహాలు చేసుకునే వారు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందరూ పురాతన పద్ధతుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు."

- ఛౌరారియా, కలర్​ ప్యాలెట్ క్రియేటివ్​ హెడ్​

పీపీఈ కిట్లు ధరించాల్సిందే..

వివాహ వేడుకలో భౌతిక దూరం పాటించేలా, కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించేలా వెడ్డింగ్​ ప్లానింగ్​ సిబ్బంది మొత్తం పీపీఈ కిట్లు ధరిస్తున్నారు.

ఛౌరారియా, కలర్​ ప్యాలెట్టే క్రియేటివ్​ హెడ్​

" పెళ్లికి వచ్చే అతిథులకు మాస్క్​, శానిటైజర్​, గ్లౌజులు, టిష్యూలతో కూడిన చిన్న కిట్​ అందిస్తాం. అందరికీ థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తాం. అలాగే పెద్దవారి కాళ్లకు మొక్కే సమయంలో వారిని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేలా.. ఓ ప్లాస్టిక్​ ట్రాన్స్​పరెంట్​ షీల్డ్​ను అందజేస్తున్నాం."

- ఛౌరారియా, కలర్​ ప్యాలెట్ క్రియేటివ్​ హెడ్​

హెల్ప్​డెస్క్​ కూడా..

వివాహానికి వచ్చే వారికి మాస్కులు, శానిటైజర్​తో పాటు హెల్ప్​ డెస్క్​ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అభిలాష్​, తరిణి వెడ్డింగ్స్​

" గతంలో ప్రపంచ వ్యాప్తంగా మేము చాలా పెళ్లిళ్లు చేశాం. కానీ ప్రస్తుతం చాలా తక్కువ వివాహాలు ఉన్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులకు సలహాలిచ్చేందుకు హెల్ప్​ డెస్క్​ కూడా ఏర్పాటు చేశాం. వివాహానికి వచ్చిన వారందరూ మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి."

- అభిలాష్​, తరిణి వెడ్డింగ్స్​

Last Updated : Jun 9, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details