కశ్మీర్ లోయలో చాలా కాలం తర్వాత సాధారణ పరిస్థితులు కనిపించాయి. శ్రీనగర్లో ఉదయాన్నే దుకాణాలు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన ప్రాంతాల్లో వాహన రాకపోకల నియంత్రణకు అదనపు సిబ్బందిని రంగంలోకి దింపారు అధికారులు.
ఆర్టికల్ 370 రద్దు దృష్ట్యా ఆగస్టు 4నుంచి కశ్మీర్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అప్పటి నుంచి సాధారణ జనజీవనం దాదాపు స్తంభించింది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం ఆంక్షల్ని క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోంది.