తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి సిటీ సెంటర్​ మాల్​లో అగ్నిప్రమాదం - లెవల్​-5

ముంబయిలోని సిటీ సెంటర్​ మాల్​లో గతరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Massive fire breaks out in Mumbai mall, no casualty
ముంబయి సిటీ సెంటర్​ మాల్​లో అగ్నిప్రమాదం

By

Published : Oct 23, 2020, 9:14 AM IST

మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని సిటీ సెంటర్​ మాల్​లో గురువారం రాత్రి 8.53 గంటలకు మంటలు చెలరేగాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 12 గంటల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా సమీప భవనాల నుంచి 3 వేలమందికిపైగా ప్రజలను ఖాళీ చేయించారు.

మాల్​లో చెలరేగిన మంటలు

ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనను లెవెల్​-5 ప్రమాదంగా ప్రకటించారు.

విస్తరించిన మంటలు

ABOUT THE AUTHOR

...view details