తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం - ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

గుజరాత్ జామ్​నగర్​లోని గురుగోవింద్ సింగ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఐసీయూ వార్డులోని రోగులను సమీప భవనంలోకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు.

GG hospital
ఆసుపత్రిలో మంటలు

By

Published : Aug 25, 2020, 5:00 PM IST

గుజరాత్​ జామ్​నగర్​ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది... రోగులను సమీపంలో ఉన్న భవనంలోకి తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలుస్తోంది.

ఐసీయూ వార్డులో మంటలు
రోగులను తరలిస్తున్న సిబ్బంది

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

పాత భవనం..

జామ్​నగర్​లోని గురు గోవింద్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతలో నాన్​- కొవిడ్​ ఐసీయూ వార్డులో మంటలు ప్రారంభమయ్యాయి. పొగ ఇతర వార్డుల్లోకి చేరగా చాలా మంది రోగులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

ఆసుపత్రిలో వ్యాపించిన పొగ
వ్యాపించిన పొగ

ఇదీ చూడండి:కూలిన ఆ భవనంలో నాలుగేళ్ల బాలుడు సేఫ్​

ABOUT THE AUTHOR

...view details