దిల్లీలోని నరేలా పారిశ్రామిక వాడలోని చెప్పుల కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధం కాగా పక్కనున్న మరో కర్మాగారానికి మంటలు వ్యాపించాయి.
సిలిండర్ పేలి రెండు కర్మాగారాలు దగ్ధం - దిల్లీ తాజా వార్తలు
దిల్లీలోని ఓ చెప్పుల కర్మాగారంలో సిలిండర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు పక్కనున్న మరో కర్మాగారానికి వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. 32 ఫైరింజన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిలిండర్ పేలి చెప్పుల కర్మాగారం దగ్ధం
మంటలను అదుపు చేసేందుకు 32 ఫైరింజన్లతో అగ్నిమాపక దళం కృషి చేస్తోంది. సహాయక చర్యలు చేపడుతుండగా ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని రాజా హరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Dec 24, 2019, 1:50 PM IST