బంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో స్థానికులు రాష్ట్ర సీఐడీ వాహనాలను పేల్చివేశారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు సీఐడీ అధికారులు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అధికారులతో ఘర్షణకు దిగిన స్థానికులు, స్వాధీనం చేసుకున్న బాణసంచా ఉన్న వాహనాన్ని పేల్చేశారు. దీనితో పాటు పలు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.
ఈ దాడి వల్ల హుగ్లీ జిల్లాలోని చిన్సురాలో పలు ఇళ్లలోని కిటికీలు, అలాగే నౌహతీ రామ్ఘాట్ ప్రాంతంలోని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తమపై అక్రమంగా దాడి చేశారంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన చేశారు.