తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై కేదార్​నాథ్​ దారిలో మసాజ్​ సేవలు... - ఏడు మసాజ్ కేంద్రాలను

కేదార్​నాథ్​ పుణ్యక్షేత్రానికి వెళ్లే క్లిష్టమైన కొండమార్గంలో ప్రయాణించే భక్తుల కోసం ఏడు మసాజ్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఎత్తైన కొండదారుల్లో ప్రయాణించి తీవ్ర అలసటకు గురయ్యే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించాలన్నదే ఈ కేంద్రాల ఏర్పాటు నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఇకపై కేదార్​నాథ్​ దారిలో మసాజ్​ సేవలు...

By

Published : Nov 20, 2019, 7:16 AM IST

కేదారనాథ్​ యాత్రికులకు వచ్చే ఏడాది నుంచి మసాజ్​ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. గౌరికుండ్​ నుంచి కేదార్​నాథ్​ వరకు ఉన్న 16 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 7 మసాజ్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

మసాజ్ కుర్చీలతో కూడిన ఈ కేంద్రాలను ప్రధాన విశ్రాంతి ప్రాంతాలైన భీంబాలి, లింకోలి, రుద్ర పాయింట్, జంగిల్‌చట్టిల్లో ఏర్పాటు చేయనున్నట్లు రుద్రప్రయాగ్​ జిల్లా కలెక్టర్​ మంగీశ్​ ఘిల్గియాల్​ తెలిపారు. ప్రయాణంతో తీవ్ర అలసటకు గురయ్యే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించేందుకే ఈ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

అంతేకాకుండా ఈ ఏర్పాట్ల వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఆదాయం పోందే అవకాశమూ ఉంటుందని పేర్కొన్నారు అధికారులు. మార్గం మధ్యలో వసతి సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరిచినందుకే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 10 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో గాడిదలు, గుర్రాలపై వెళ్లే యాత్రికులు హెల్మెట్​ ధరించటం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు గుర్రాలను అదుపుచేసే వారు కూడా హెల్మెట్​ ధరించాలని సూచించారు. యాత్ర మార్గంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:దిల్లీ కాలుష్యంపై భారత్​-బ్రిటన్​ శాస్త్రవేత్తల ఉమ్మడి పోరు

ABOUT THE AUTHOR

...view details