ఉగ్రవాద కట్టడి దిశగా అసోం పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో ఒకే రోజు 644 మంది ఉగ్రవాదులు లొంగిపోయారు. ఉల్ఫా సహా 8 ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు ఇందులో ఉన్నారు.
పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు - assam news
అసోం పోలీసుల ఎదుట భారీ సంఖ్యలో ఉగ్రవాదులు లొంగిపోయారు. 8 ఉగ్రసంస్థలకు చెందిన 644 మంది అసోం సీఎం శర్వానంద సోనోవాల్ సమక్షంలో సరెండర్ అయి ఆయుధాలను అప్పగించారు.

పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు
పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు
భారీ ఎత్తున ఉగ్రవాదులు లొంగిపోవటం వల్ల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సోనోవాల్ సమక్షంలో లొంగిపోయిన ఉగ్రవాదులు.. భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
అసోం రాష్ట్రానికి, పోలీసు శాఖకు ఇది కీలక రోజు అని ఆ రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత అన్నారు.
Last Updated : Feb 18, 2020, 3:34 AM IST