ఇటీవల కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై పలు వార్తలు ఆందోళన కలిగించాయి. కొన్ని చోట్ల ఎలాంటి నిబంధనలు పాటించకుండా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక బళ్లారి జిల్లాలో ఇది జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్.. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదని... విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ వీడియోలో వ్యక్తిగత రక్షణ కవచాలను వేసుకున్న కొంత మంది వ్యక్తులు.. మృతదేహాలతో కూడిన సంచులను ఒక గుంతలో వేస్తున్నారు. ఈ దృశ్యాలను ఎవరో చరవాణీలో బంధించారు.