తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై మసూద్​ ఆడియో టేప్​ కలకలం

మసూద్​ అజార్​కు సంబంధించినదిగా గుర్తించిన ఒక ఆడియోటేప్​ ప్రస్తుతం కలకలం రేపుతోంది. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన భారత్​పై అజార్​ ఈ టేప్​లో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తనను నిషేధిత ఉగ్రవాదిగా ఐరాస గుర్తించినప్పటి నుంచి అజార్​ మౌనంగా ఉన్నాడు. తాజాగా మసూద్​ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

కశ్మీర్​పై మసూద్​ ఆడియో టేప్​ కలకలం

By

Published : Aug 11, 2019, 2:21 PM IST

Updated : Sep 26, 2019, 3:38 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దుతో భారత్​-పాకిస్థాన్​​ దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. భారత్​ నిర్ణయంతో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరగవచ్చని పాక్​ ​ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఓ ఆడియోటేప్​ కలకలం సృష్టిస్తోంది.

ఈ టేప్​ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్​ అజార్​కు చెందినదిగా అరోరా ఇంటెల్సంస్థగుర్తించింది. ఇందులో తన అనుచరులకు మసూద్​ ఓ సందేశాన్ని అందించిన్నట్టు పేర్కొంది. ఇందులో అజార్​ కశ్మీరీలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలున్నాయి.

"కశ్మీర్​ ప్రజలను అల్లా దీవించాలి. పోరాడేందుకు వారికి శక్తినివ్వాలి. వారికి స్వతంత్రం లభించాలి. తన దాడులతో ముజాహిదీన్​ గమ్యానికి చేరువలో ఉంది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి మోదీ ప్రభుత్వం తన ఓటమిని అంగీకరించింది. 'జిహాద్​ కశ్మీర్'​లో ఒక అధ్యయనం ముగిసింది. ఇప్పుడు రెండో అధ్యయనం మొదలవనుంది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశానని మోదీ అనుకుంటున్నారు. దీనితో కొందరు ధనికులు మొత్తం కశ్మీర్​నే కొనేస్తారు. పర్యటకంతో, నిషేధిత చట్టాలతో మరింత సొమ్ము పోగుచేసుకుంటారు. కశ్మీర్​ ముస్లింలు తమ ఉనికిని పోగొట్టుకుంటారు. మోదీ! ఇది కల మాత్రమే. ఇది ఎప్పటికీ జరగదు."
-మసూద్​ అజార్​దిగా చెప్తున్న టేప్​ సారాంశం

మసూద్​ అజార్​ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటి నుంచి అతడు మౌనంగా ఉన్నాడు. మసూద్​ను రహస్య ప్రదేశంలో దాచి.. అతడిని మసీదుల్లో ప్రసంగించకుండా, ఆడియోటేప్​లు విడుదల చేయనివ్వకుండా పాక్​ అడ్డుకుంటోందని సమాచారం.

అయితే కశ్మీర్​కు సంబంధించిన అజార్​ టేప్​ విశ్వసనీయతను అరోరా ఇంటెల్​ సంస్థ గుర్తించలేకపోయింది. కానీ అందులోని సందేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని పేర్కొంది.

ఆర్టికల్​ 370రద్దు నేపథ్యంలో భారత్​లో దాడులు చేయడానికి జైషేకు.. ఐఎస్​ఐ అనుమతినిచ్చినట్లు అరోరా ఇంటెల్ ఈ కథనంలో పేర్కొంది. ఇటీవలే మసూద్​ అజార్ సోదరుడు ఇబ్రహీమ్​ అజార్​ను​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో గుర్తించాయి నిఘా వర్గాలు.

ఇదీ చూడండి:- మరోసారి హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు​

Last Updated : Sep 26, 2019, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details